GHMC కమిషనర్‌గా పనిచేస్తున్న ఆమ్రపాలి..తాను తెలంగాణలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని రేవంత్ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సమాచారం. అయితే UPPSC అప్లికేషన్లో ఆమ్రపాలి తన పర్మినెంట్ అడ్రస్ను విశాఖపట్నంగా మెన్షన్ చేశారు. దాంతో ఆమెను ఏపీ కేడర్కు కేటాయించారు. తనను తెలంగాణ స్థానికురాలిగా గుర్తించి తెలంగాణ కేడర్కు పంపాలని ఆమ్రపాలి కోరినప్పటికీ ఆ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.