మేనేజర్ సిక్ లీవ్ ఇవ్వకపోవడంతో.. ఆఫీసులోనే ఉద్యోగి మృతి

82பார்த்தது
మేనేజర్ సిక్ లీవ్ ఇవ్వకపోవడంతో.. ఆఫీసులోనే ఉద్యోగి మృతి
థాయ్లాండ్ లోని సముత్ ప్రావిన్స్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చేరింది. అయితే తాను ఆఫీస్ కు రాలేనని ఒక్క రోజు సిక్ లీవ్ ఇస్తే కోలుకుంటానని మేనేజర్ కి చెప్పింది. ఆయన తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని హెచ్చరించారు. దీంతో ఉద్యోగం కోల్పోతానేమోనని ఆమె ఆఫీస్ కు వచ్చి 20 నిముషాలు పనిచేయగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி