ఛాంపియన్స్ టోర్నీని చివరి సారిగా 2017లో నిర్వహించారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పాకిస్థాన్ వేదికగా నిర్వహిస్తున్నారు. అయితే 8 ఏళ్ల పాటు ట్రోఫీని ఆపేయడానికి కారణం ఏంటంటే.. ప్రతి ఫార్మాట్‌లోనూ ఒకటే మెగా టోర్నీ ఉండాలన్న నిర్ణయంతో దీనిని నిర్వహించడం ఆపేశారు. కానీ మళ్లీ నిర్ణయం మార్చుకున్న ఐసీసీ.. మళ్లీ ట్రోఫీని నిర్వహించాలని నిర్ణయించుకుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ట్రోఫీ 2029లో ఇండియాలో జరగనుంది.