రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. షాద్‌నగర్‌కు చెందిన మల్లేశ్వరరావు కేశంపేట మండల పరిధిలోని వేమలనర్వలో ఉన్న తన పౌల్ట్రీ ఫామ్ వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇప్పలపల్లి గ్రామశివారులోకి రాగానే రహదారి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. గమనించిన గ్రామస్థులు వెంటనే కారులో నుంచి మల్లేశ్వరరావు అనే వ్యక్తిని బయటకు తీశారు. తర్వాత జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు.