AP: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించారు. తనకు, లక్ష్మీ రెడ్డికి కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, అంతకు మించి ఏమీ లేదని ఆయన వివరించారు. ఒక మహిళను రాజకీయాల్లోకి లాగి అనేక విధాలుగా హింసకు గురిచేశారని ఆయన అన్నారు. తనపై కుట్ర పన్నిన వారిని ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ కు వెల్లడిస్తానని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.