TG: పండుగ పూట విషాదం.. భర్తకు గాయాలు, భార్య మృతి (వీడియో)

554பார்த்தது
తెలంగాణలో సంక్రాంతి పండుగ పూట విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కారులో కాగజ్ నగర్ కు మెకానికల్ ఇంజనీర్ అక్కు రాజు, అతడి భార్య బయలుదేరారు. అతివేగంతో కారును లారీ ఢీ కొట్టింది. దీంతో ఘటనా స్థలంలో కారు భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలు కాగా, అతడి భార్య మృతి చెందారు.

தொடர்புடைய செய்தி