మహబూబ్‌నగర్ సభలో 2023 అక్టోబరు 1న తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్రం దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు మెయిన్ ఆఫీస్ ను ఎక్కడ ఏర్పాటు చేసేదీ అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. దానికి ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించింది. మంగళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డును ప్రారంభించారు.