తెలంగాణలోని యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా సదర్ ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.