తుంగతుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీపీఎం

54பார்த்தது
తుంగతుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీపీఎం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం డీఆర్డిఏ డీపీఎం రత్తయ్య సందర్శించి రికార్డ్స్ తనిఖీ చేశారు. అదేవిధంగా రైతులకు కనీస సౌకర్యాలు టెంటు, మంచినీరు ఏర్పాటు చేయాలని, సీరియల్ ప్రకారం తూకం వేయాలని, దిగుమతి కాగానే బిల్లు ఎంట్రీ చేసి డీఎమ్ ఆఫీసులో సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాంబాబు, సీసీ యాదగిరి, వివో ఏ శైలజ, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி