తుంగతుర్తి మండలంలో ఐకెపి కేంద్రాల్లో దాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుంది. ఐకేపి కేంద్రాలకు తెచ్చి 20 రోజులు గడుస్తున్నా కూడా కాంటాలు కావడం లేదని గురువారం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలని సూచించినా కూడా ఐకెపి నిర్వాహకులు అలసత్వం వహిస్తున్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.