నూతన్ కల్ నుండి సంఘెం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆ చేపట్టిన పాదయాత్రను సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై శంకుస్థాపన చేసిన నేటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. రోడ్డు గుంతల మయంగా ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు.