సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల గ్రామంలోని ఉర్సు బాలరాజు, మహేశ్వరీల రెండు కుటుంబాల ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పావర్ వెంటనే రెండు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులు ఏమాత్రం అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని తెలిపారు.