డిసెంబర్ 1 హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహ గర్జన, రాజ్యాంగ రక్షణ బహిరంగ సభ విజయవంతం చేయాలని రాష్ట్ర కో చైర్మన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ చార్జ్ ఎర్రమళ్ళ రాములు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్య్రమంలో టీం జిల్లా కన్వీనర్ చింతపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు.