సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా యువతకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండడం అంశాలపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు రాజశేఖర్, సైదులు, శ్రీనివాస్, నరసింహ రావు తదితరులు ఉన్నారు.