రేపు కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో మంత్రి ఉత్తమ్ పర్యటన

65பார்த்தது
రేపు కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో మంత్రి ఉత్తమ్ పర్యటన
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం పర్యటన షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. ఉదయం 9కి హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో బయలు దేరనున్నారు. 11. 30 గంటలకు కాగిత రామచంద్రపురం ఎన్ఎస్పి కాలువ గండి పడిన ప్రదేశానికి చేరుకొని మరమ్మత్తు పనుల పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 02 గంటలకు కరక్కాయలగూడెం సమీపంలో ముక్త్యాల బ్రాంచి ప్రధాన కాల్వ గండి పడిన ప్రదేశానికి బయలు దేరి.. ముక్త్యాల బ్రాంచి కాల్వ గండి మరమ్మత్తు పనుల పరిశీలించనున్నారు.

தொடர்புடைய செய்தி