మాదకద్రవ్యాలను విడనాడి సమాజాభివృద్ధికి యువత నడుంబిగించాలని తెర సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం చిలుకూరులో భారత యువజన సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో డ్రగ్స్ - మత్తు పదార్థాల నిర్మూలన సమాజ అభివృద్ధిలో నేటి యువత పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.