సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోతె మండల ఎస్సై యాదవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నామవరంలో పోలీసు కళాబృందాల ఆధ్వర్యంలో గ్రామస్తులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించి మాట్లాడారు. అపరిచిత వ్యక్తులతో నగదు లావాదేవీలు జరప వద్దన్నారు. సెల్ ఫోన్ లోకి వచ్చే ఓటీపీలు, బ్యాంకు ఎకౌంటు నంబర్లు మోసగాళ్లకు చెప్పవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, కళాబృందం కళాకారులు పాల్గొన్నారు.