సిపిఐ అనుబంధ మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో నవంబర్ లో జరిగే రాష్ట్ర, జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లులు అన్నారు. బుధవారం చిలుకూరు మండల కేంద్రంలోని దొడ్డ నరసయ్య భవన్ లో నిర్వహించిన జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా నాయకురాలు ఏ లక్ష్మీ ఉన్నారు.