రామాపురం నుండి రత్నవరం వరకు రోడ్డు బురద మాయంగా మారి రాక పోకలకు ఇబ్బందిగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొమరబండ మేజర్ కాల్వ పూడిక తీసి బురద మట్టిని రోడ్డుపై వేశారని రైతులు వాపోతున్నారు. గతంలో డిఎఫ్టీ ద్వారా ఎమ్మెల్యే రూ. 4 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని కాంట్రాక్టర్ స్పందించి బురద మట్టిని తొలగించి రోడ్డు పనులు ప్రారంభించాలని వారు కోరుతున్నారు.