కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం దూళ్లగుట్ట బాల ఉగ్రలక్ష్మీనర్శింహాస్వామి ఆలయానికి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేటకు చెందిన నెల్లూరి రమేష్, మాలతీ దంపతులు ఆలయ నిర్మాణానికి రూ. 50,116 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు దాతలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్రావు నాగేంద్రమ్మ, సాహితీ, లాస్యశ్రీ ఉన్నారు.