కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పని చేసే ప్రతి ఒక్కరికి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి లు తగిన న్యాయం చేకూరుస్తారని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కోదాడలో సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన వంగవీటి రామారావును అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేష్ డైరెక్టర్లు ప్రభాకర్, శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు, బాబు ఉన్నారు.