హుజూర్ నగర్: గడ్డిపల్లి కి రేపు మంత్రుల రాక
సూర్యాపేట జిల్లాలో రేపు ఆదివారం మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లు హుజూర్ నగర్ నియోకవర్గం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లో ఇంటిగ్రేటెడ్ స్కూలుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హుజూర్నగర్ లో రామస్వామి గట్టు దగ్గర నిర్మించిన ఇండ్లు పరిశీలిస్తారని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.