AP: కృష్ణా జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడు అక్కడ ఉరేసుకున్నాడు. ఉయ్యూరుకు చెెెందిన చందా మాధవరాజు, మాధవి ప్రేమించుకుని 2021లో విడిపోయారు. గత రాత్రి రాజు.. మాధవి ఇంటికి వెళ్లి పెళ్లి చేయమని యువతి తల్లిదండ్రులను అడిగాడు. దానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దాంతో అర్ధరాత్రి సమయలో మాధవి ఇంటి వరండాలో ఫ్యాన్‌కు ఉరేసుకుని రాజు చనిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.