సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సంక్షేమ హాస్టల్ విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని వాళ్లకి నాణ్యమైన విద్య ఆరోగ్యం పటిష్టంగా అందించాలని కాస్మోటిక్, డైట్ చార్జీలు పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.