కార్పెంటర్లకు ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలని హుజూర్నగర్ పట్టణ కార్పెంటర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చేపూరి నరసింహచారి, రాగి శ్రీనివాస చారిలు అన్నారు. శుక్రవారం హుజూర్నగర్ లో నిర్వహించిన యూనియన్ తొలి సమావేశంలో వారు మాట్లాడారు. కార్పెంటర్లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు గోధురిబ్రహ్మచారి , కార్యనిర్వాక అధ్యక్షుడు పెద్ద సూర్యనారాయణ చారి ఉన్నారు.