గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని నేరేడుచర్ల పిఆర్టియు మండల శాఖ అధ్యక్షులు ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. గురుకుల పాఠశాలల అనేక సమస్యలను ప్రభుత్వం సంఘం పరిష్కరించిందని గుర్తు చేశారు.