మేళ్ల చెరువు మండలం కందిబండ గ్రామం వద్ద బ్రిడ్జి బీటలు వారి కూలీ పోయే స్థితిలో ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి పై నుండి రాకపోకలు కొనసాగించవద్దని సూచిస్తున్నారు. ఆదివారం బ్రిడ్జి వద్దకు జనం చేరి వివరాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అధికారులు స్పదించి ఈ బ్రిడ్జి మీది నుండి వాహనాలు వెళ్లకుండా సెంట్రీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.