ధరణి దరఖాస్తుల్లో అన్ని వివరాలను పరిశీలిస్తూ వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హన్మంత్ తెలిపారు. శనివారం ఆయన రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశమయ్యారు. ధరణి, ప్రజావాణి దరఖాస్తులు, వాల్టా చట్టంపై సమీక్షించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. పరిశ్రమలు, ఇళ్ల అవసరాలు, కమర్షియల్ అవసరాలకు బోరుబావులు వేయాలంటే తప్పనిసరిగా అనుమతులు పొందాలన్నారు