యూపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. హమీర్‌పూర్‌లోని కురారా ప్రాంతంలో అక్రమ మట్టి తవ్వకాల మాఫియా యువకుడి ప్రాణాలను బలిగొంది. మట్టితో నిండిన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో.. ఆ ట్రాక్టర్ డ్రైవర్ స్పాట్‌లోనే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మట్టి మాఫియాకు సంబంధించిన ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.