పేదల పెన్నిధిగా కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి పేరు ఉంది. పెద్దపల్లికి చెందిన ఓ భక్తుడు కుమారునికి ఇద్దరు పిల్లలు (మనవాళ్లు) జన్మించిన నేపథ్యంలో మొక్కిన కోడె మొక్కులు చెల్లించుకునేందుకు ఆదివారం రాజన్న ఆలయానికి వచ్చామని తెలిపారు. కోరిన కోరిక తీరినందుకు చాలా సంతోషంగా ఉందని భక్తుడు చెప్పారు. ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.