పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రానిదని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగు తీరంలో గురువారం సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబురాలు - 2024 పేరిట చేపట్టిన వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై తిలకించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని కోరారు.