కథలాపూర్: పల్లకిలో ఊరేగిన పొన్నచెట్టు
దసరా ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు పల్లకీ వాహనంలో గంగపుత్ర సోదరులు పొన్న చెట్టును ఊరేగింపుగా తీసుకెళ్లారు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఆదివారం సాయంత్రం మహిళలు మంగళహారతులు స్వామీవారికి అందించారు. స్థానిక పురోహితులు నారంభట్ల నరేష్ శర్మ, శ్రీనాధ్ శర్మలు పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పిల్లలతో సహా గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.