రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా జిల్లాలోని కుటుంబాల వివరాలను పకడ్బందీగా సేకరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్దపల్లి మండలం కాపులపల్లి, కాసులపల్లి, పాలితం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సమగ్ర ఇంటింటి సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు అహ్మద్ బాషా, లక్ష్మణ్ బాబు పాల్గొన్నారు.