మంథని మండలం ఎక్లాస్ పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయున్ని నియమించాలని విద్య కమిటి అధ్యకుడు సమ్మయ్య శనివారం ఏం ఈ ఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ పాఠశాలలో 2018 నుండీ తెలుగు బోధించే వాళ్లు లేకపోవడం వల్ల
విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. త్వరలో పదవ తరగతి
పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తెలుగు సబ్జెక్ట్ లో వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఉపాధ్యాయున్ని నియమించాలని కోరారు.