జగిత్యాలలో మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి సంతాప సభ జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మేల్యే మెడిపెల్లి సత్యం పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యకర్తల కష్టసుఖాలు మాకు తెలుసునని, వారి కష్టాల్లో సుఖాల్లో మేము వారికి తోడుగా ఉంటామన్నారు.