జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మంగళవారం హాట్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి ప్రతీసారీ ఇదే చివరి ఎన్నికలని చెబుతున్నప్పుడు పార్టీ కూడా భవిష్యత్ నాయకులను తయారు చేసుకుంటుంది కదా అని చెప్పారు. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎంత మంది బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకోలేదు అని ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులను చేర్చుకున్నది నిజం కాదా అన్నారు.