జగిత్యాల: జాబితాపూర్ లో దుర్గామాతకు బోనాలు

82பார்த்தது
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. డప్పు సప్పుల్ల నడుమ మహిళలు ఉపవాసముండి బోనం నెత్తిన పెట్టుకొని అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత స్వాములు, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி