గత ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం గంగాధర అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్నదాతలపై చిన్న చూపు అంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వెంటనే రైతు ఖాతాల్లో రైతు భరోసా జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు.