గంగాధర మండల కేంద్రంలో మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్ ఆధ్వర్యంలో సోమవారం దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకలలో పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అనంతరం సత్య మాట్లాడుతూ ఆజాద్ ఎంతో గొప్ప వ్యక్తి అని అతని అడుగుజాడల్లో విద్యార్థులు నడిచి మంచి భవిష్యత్తు పునర్నిర్మించుకోవాలని కోరారు.