కల్కి చిత్రంలో ప్రభాస్ గెటప్ జోకర్లా ఉంది.. అర్షద్ వార్సీ వ్యాఖ్యలను ఖండించిన సిద్ధు జొన్నలగడ్డ

575பார்த்தது
కల్కి చిత్రంలో ప్రభాస్ గెటప్ జోకర్లా ఉంది.. అర్షద్ వార్సీ వ్యాఖ్యలను ఖండించిన సిద్ధు జొన్నలగడ్డ
కల్కి 2898 ఏడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ సినీ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇన్స్టా వేదికగా స్పందించారు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే తప్పులేదని.. జోకర్ లాంటి పదాలను ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని చెప్పాడు. ప్రభాస్ కు సినిమాల సక్సెస్ కు మించిన స్టార్ డమ్ ఉందని తెలిపాడు.

தொடர்புடைய செய்தி