సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాల్కల్ కేజీబీవీ పాఠశాల ఓ విద్యార్థినిని తీవ్ర అస్వస్థతకు గురవడంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి దగ్గు ఎక్కువ కావడంతో హైదరాబాద్ కు తరలించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. మిగతా విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.