సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్తుండగా గజ్వేల్ నియోజకవర్గం రాజీవ్ రహదారి పక్కన ఉన్న పాతుర్ కూరగాయల మార్కెట్‌ను బుధవారం మాజీ మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు రైతులను ఆప్యాయంగా పలకరించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. గతంలో తామంత రోడ్డుపై కూరగాయలు విక్రయించే వారమని, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వనికిపోయే వారిమని వారు తెలిపారు.