అవసరం మేరకే సెల్ ఫోన్ వాడాలని, గూగుల్ పే, ఫోన్ పే చేసేటప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి సూచించారు. పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం సిద్ధిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగాయపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో ఉన్న యువకులు, పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలన్నారు.