దుబ్బాక: ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేర్వాపూర్ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఉషయ్య గారి రాజిరెడ్డి, గోరింట రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.