అక్బర్ పేట మండల పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని వడ్ల కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని తెలిపారు. అక్బర్ పేట సర్పంచ్ ధర్మారం స్వరూప బుచ్చయ్య, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, జీడిపల్లి రవి, కూతురు స్వామి, సుకూరి లింగం, పోతనక రాజయ్య, ఐకెపి సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.