దుబ్బాక: టీ తాగేందుకు వెళ్లి వ్యక్తి అదృశ్యం
దుబ్బాక మండల పరిధిలో ఓ వ్యక్తి టీ తాగేందుకు బయటికి వెళ్లి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న ఉదయం బెల్లె భూమయ్య తాగి వస్తానని భార్యకి చెప్పి వెళ్ళాడు. రాత్రి అయినా భర్త ఇంటికి తిరిగికి రాకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతికారు. బంధువులకి ఫోన్ చేసి ఆచూకీ గురించి అడిగారు. ఎక్కడ ఆచూకీ దొరకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.