సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన తాటి రాజ రాములు ఇటీవల మరణించాడు. ఈ విషయం తెలుసుకుని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు ఆదేశాల మేరకు గ్రామ ఉప సర్పంచ్ బొల్లం స్వామి బాధిత కుటుంబాన్ని పరామర్శించి మరియు 50 కిలోల బియ్యం అందజేశారు. వీరితో పాటు బీజేవైఎం మండల అధ్యక్షులు ముత్యాల చంటి, బిజెపి గ్రామ అధ్యక్షుడు బండి రాజు మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.