దుబ్బాక మండలంలోని లింగాపూర్, వెంకట్రావుపేట, తుక్కాపూర్, ఎల్లారెడ్డిపేట, జప్తిలింగారెడ్డిపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులను కోరారు.