ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. ఆయనకు రిమాండ్ విధించాలని పోలీసుల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. అనుమతులు లేకున్నా సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారని వారు కోర్టుకు తెలిపారు. మరోవైపు తనపై కేసు కొట్టివేయాలని బన్నీ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.