రుణమాఫీ, వరికి బోనస్, ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్, పేదలకు వైద్య సౌకర్యాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా బలహీన వర్గాలకు అందాయని CM రేవంత్ తెలిపారు. ఏ తల్లి అయితే మన అమ్మ లాగా ఉంటుందో, అడక్కుండానే మన ఆకలిని గుర్తించి బుక్కెడు అన్నం పెడుతుందో అలాంటి తెలంగాణ తల్లిని తెచ్చుకున్నామని చెప్పారు. మన అమ్మకు ప్రతిరూపం. మన అక్కకు ప్రతిరూపమైన తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్నామన్నారు.